Spoken English Tips

  • ముందుగా ఇంగ్లీష్ మాట్లాడటంపై ఉన్న భయాన్ని వదిలేయండి.
  • మొహమాటం లేకుండా మీకు బాగా దగ్గరి స్నేహితులతో , కుటుంబ సభ్యులతో ఇంగ్లీష్ లో మాట్లాడాలి 
  • ప్రారంభదశలో తప్పుల మీద దృష్టి పెట్టకుండా వీలైంత వరకు ఇంగ్లీష్ లో మాట్లాడుతు ఉండాలి 
  • మీరు నిత్యం వాడే వాడుక భాషలో ఎక్కువగా ఇంగ్లీష్ పదాలు వచ్చె లాగా చూసుకోవాలి 
  • మీరు ఇంగ్లీష్ మాట్లాడే సంధర్బాల్లో , చదివేటప్పుడు వచ్చే సందేహాలను రాసుకోని మీ స్నేహితులను గాని , ఇంగ్లీష్ టీచర్స్ ను గాని అడిగితెలుసుకోండి లేదా డిక్షనరిలో మరియు ఇంటర్నెట్ లో వెతికి చూడండి 
  • ప్రతి రోజు మీరు చేసిన రోజువారి పనులు మరియు ఈ రోజు ఎలా గడిచింది అనే విషయాలు సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్ లో డైరి రాయండి 
  • ఇంగ్లీష్ చానెల్స్ గాని , సినిమాలు గాని చూస్తున్నప్పుడు వారు ఎలా మాట్లాడుతున్నారో శ్రద్దగా విని ప్రయత్నించండి
  • ఎదైనా నేర్చుకునేటప్పుడు ఈ క్రింద చూపించిన క్రమంలో ప్రయత్నిస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుంది
  1. వినడం 
  2. మాట్లాడటం 
  3. చదవడం 
  4. రాయడం 
" A Good Listener is a Good Speaker "
" మంచి శ్రోత మాత్రమే గోప్ప వక్త కాగలడు "
  • ఏదైనా ఒక టాపిక్ తీసుకోని దానిని ముందుగా తెలుగులో రాసుకోని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేయండి 
  • మీకు బాగా ఇష్టమైన తెలుగు పాటలను సరదాగా ఇంగ్లీష్ లోకి మార్చి పాడండి 

" Practice Makes a Man Perfect "
  • ప్రతి రోజు కోన్ని ఇంగ్లీష్ పదాలు మరియు వాటి అర్ధాలు నేర్చుకోవడం అలవాటు చేసుకోండి 
  • పిల్లలు చదువుకునే ఇంగ్లీష్ స్కూల్ పుస్తకాలు తెప్పించుకోని చదవండి ఎందుకంటే వాటిలో ఉపయోగించే ఇంగ్లీష్ విధానం చాలా తేలికమైన పదాలతో ఉంటుంది 
"All The Best My Dear Friends "
రచయిత 
ప్రవీణ్ కూమార్ 
www.learnenglishintelugu.blogspot.in

No comments:

Post a Comment